A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Monday, September 8, 2014

పాలు పొంగించడం

నేటి కిచన్‌ లో అందరూ దాదాపు సిమెంట్‌ బల్లలు వాడుతున్నారు. సాధారణం గా మనం నూనె వస్తువులు ఎక్కువ వాడడం పరిపాటి. ఇక ఈ సిమెంట్‌ , టైల్స్‌ బల్ల పై ఈ నూనె వలగడం, తాలింపు ఆవిరి నుంచి వచ్చిన నూనె, కూర వగైరా వలిగినపుడు నూనె ఎంతోకొంత ఈ బల్ల పై వలగటం జరుగుతుంది.

ఇక మామోలు గా ఈ ప్రపంచం లో దాదాపు అన్ని వస్తువువలపై బేక్టీరియా పెరగట జరుగుతుంది. ఇక నూనె దానికి తోడై , ఆహార పదార్ధాలు ఉన్న చోట మామోలు కన్నా 20 రెట్లు ఎక్కువ (Citation needed) బాక్టిరీయా పెరుగుతుంది. పైగా , ఇలా (Oil) enriched culture medium లో పెరిగేవి హానికరమైన బాక్టీరియా. పొరపాటున మనం ఆ బల్ల పై చేతులు పెట్టడం , అవి అనుకోకుండా నోట్లో పెట్టుకోవడం అపుడప్పుడు జరగుతుంది. మరి అక్కడ హాని కరమైన బాక్టీరియా వల్ల అతిసారం , జ్వరం , ఇన్‌ ఫెక్షన్‌ లాంటివి రావచ్చు. ఇటువంటివి నివారించేదుకే మన పెద్దలు ఓ మహత్తరమైన ఐడియా లో ముందుకొచ్చారు.
"అదే పాలు పొంగించడం"
అవును పాలు పొంగి ఆ కిచన్‌ ఏరియా లో ప్రవహిస్తే , పాలలో ఉండే హాని లేమి బాక్టీరియా అయినట్టి లాక్టో బాసిలెస్‌ పెరిగి , హానికర బాక్టీరియా ఉనికి కి పోటీ గా మారుతాయి. అందుకే పాలు పొంగడం మంచిది, లక్ష్మీ దేవీ అని చెప్పారు మన పెద్దలు సింపుల్‌ గా. ఇక కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగించడం మన సంస్కృతి లో భాగం.
ఇక హింధూ సనాతన ధర్మాలలో విగ్రహాలకు పాలాభిషేకం చేయడం పరిపాటి. ఇక్కడ దేవాలయం అనగా ఎక్కువ మంది జనాలు వచ్చీ పోయే చోటు కనుక , పైగా పుణ్యం కోసం ప్రతీదీ స్పర్శించి ముక్కుకోవడం మన అలవాటు. అక్కడ కూడా కొబ్బరి కాయలు అవీ హానికర బాక్టీరియా పెరగడం వల్ల వాటి బారి నుంచి తప్పించడానికి పాలాభిషేకం చేస్తే ఎక్కువ పుణ్యం అని చెప్పారు . పైగా ఈ బాక్టీరియా , వల్ల దేవాలయం , ఊరులో కూడా చెడు బాక్టీరియా కౌంట్‌ తగ్గుతాది. అందుకే హింధూ సనాతన ధర్మాలు చాలా గొప్పవి. అభిషేకాలకు ఎందుకు అలా లీటర్లు లీటర్లు పాలు పారబోయడం, పేదలకు పంచండి అని వాగే కుహౌనా మేధావులకు ఈ విషయం ఓ మొఠ్టికాయ మొఠ్టి చెప్పండి. ఇక ఈ విషయం మన తరువాత తరాలకు చెప్పి , హింధూ ధర్మాల గొప్పతనం చెప్పండి.
by
Murthy Kanakala

Thursday, February 20, 2014

తెలుగు భాగవత తేనె సోనలు


తెలుగు భాగవత తేనె సోనలు
(2013)
పద్య సూచిక
Table of Contents
1.                             అంధకారవైరి
2.                             అంబనవాంబు
3.                             అంభోజనాభున
4.                             అక్క
5.                             అక్కట
6.                             అటమట
7.                             అడిగెదనని
8.                             అతులదివ్య
9.                             అనయంబు
10.                         అనుపమగుణహారా
11.                         అన్నవు
12.                         అభ్రంలిహా
13.                         అమ్మలగన్న
14.                         అమ్మా
15.                         అలవాటు
16.                         అలవైకుంఠపురంబులో
17.                         ఆఁకలి గొన్న
18.                         ఆతత సేవ
19.                         ఆతేరా
20.                         ఆదర మొప్ప
21.                         ఆయెలనాగ
22.                         ఆరాటము
23.                         ఆశౌరికి
24.                         ఇంతింతై
25.                         ఇందిందిరాతి
26.                         ఇమ్మగువ
27.                         ఈ హేమంతము
28.                         ఎంత కాలము
29.                         ఎన్నడుం
30.                         ఏ కీడు
31.                         ఏనీగుణములు
32.                         ఒకపరి
33.                         ఒనరన్
34.                         కంటిగంటి
35.                         కటివిరాజిత
36.                         కమలాక్షు
37.                         కరిదిగుచు
38.                         కరుణాకర
39.                         కర్ణాలంబిత
40.                         కలడందురు
41.                         కలుగఁడే నాపాలి
42.                         కళలు
43.                         కాముని
44.                         కామోత్కంఠత
45.                         కారే రాజులు
46.                         కాళికి
47.                         కైలాసాచల
48.                         క్షోణితలంబునన్
49.                         గగనము
50.                         గజనామధేయ
51.                         గజ్జలు
52.                         గొడుగో
53.                         ఘనసింహంబుల
54.                         ఘనులాత్మీయ
55.                         చండ
56.                         చదివించిరి
57.                         చదువనివాఁ
58.                         చనిచని
59.                         చను నీకు
60.                         చిక్కడు
61.                         చిత్రముగ
62.                         చేతులారంగ
63.                         చేబంతి
64.                         జగదవనవిహారీ
65.                         జనవర
66.                         జోజో
67.                         తనయులార
68.                         తాటంకా
69.                         తిలక మేటికిలేదు
70.                         తీపుగల
71.                         తెఱవ
72.                         తోయంబులివి
73.                         తోయజసంభవ
74.                         తోయములు దెమ్ము
75.                         తోయరుహోదరాయ
76.                         దండంబు
77.                         దిటచెడి
78.                         దీనుల
79.                         దూర్వాంకురంబుల
80.                         దేవా
81.                         ధర విరులు
82.                         ధరణిదుగితృ
83.                         నడవదు
84.                         నమ్మి
85.                         నమ్మితి
86.                         నల్లనివాడు
87.                         నానానేకప
88.                         నిరయంబైన
89.                         నిరయమునకు
90.                         నీలగళాపరాధి
91.                         నీవారము
92.                         నుతచరితులార
93.                         నూతనగరళస్తని
94.                         పంచబాణుని
95.                         పలుకులు
96.                         పల్లవ
97.                         పిడుగు పడదు
98.                         పుట్టంబుట్ట
99.                         పుట్టి
100.                      పుట్టిపుట్టడు
101.                      పున్నాగ
102.                      పెట్టిరి
103.                      బలయుతులకు
104.                      బలవంతుడ
105.                      బాలశీతాంశు
106.                      బాలాజన
107.                      బాలుండీతడు
108.                      బాలుండీతడుమంచి
109.                      బాలురకుఁ
110.                      బిడ్డడు
111.                      బుద్ధిమంతుడయిన
112.                      భగవంతుం
113.                      భూతములకు
114.                      భ్రమరా
115.                      మందార మకరంద
116.                      మకరమొకటి
117.                      మగువా
118.                      మమ్ము
119.                      మరలుపు
120.                      మాకందర్పుని
121.                      మాటిమాటికి
122.                      మామా
123.                      మున్నుగ్రాటవిలో
124.                      మృగనాభి
125.                      యజ్ఞాంగి
126.                      రక్షకులు
127.                      రవిబింబం
128.                      రా పూర్ణచంద్రిక
129.                      రాజఁట
130.                      రామలతోడను
131.                      లలితస్కంధము
132.                      లేదని
133.                      లోకంబులు
134.                      వచ్చెదరదె
135.                      వారిగోరుచున్న
136.                      వారిల్లు
137.                      వాలిన భక్తి
138.                      వావిఁ జెల్లెలు
139.                      విడిచితి
140.                      విడువిడుఁడని
141.                      విశ్వకరు
142.                      విష్ణుకీర్తనములు
143.                      వెన్నదినఁగఁ
144.                      శ్రీ కైవల్య
145.                      శ్రీ మన్నామ
146.                      శ్రీకాంతా
147.                      శ్రీమరుదశన
148.                      శ్రీయుతమూర్తి
149.                      శ్రీరాజిత
150.                      శుకుడు
151.                      సంతస
152.                      సకలార్థసంవేది
153.                      సరసింబాసిన
154.                      సర్వేశుడు
155.                      సిరికిం
156.                      సూరిజన
157.                      హరియుం
158.                      హరిసర్వాకృతులం
159.                      హలకులిశ
160.                      హవరూపివి


తెలుగు భాగవత తేనె సోనలు

అంధకారవైరి

1-255-ఆ.
అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ
జనిన నంధ మయిన జగము భంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల మగుదు మయ్య.

శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ద్వారకానగరానికి తిరిగి వచ్చాడు. ఆత్మీయ పౌరులు స్వాగతిస్తూ పలుకుతున్నారు సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.

1-255-aa.
aMdhakaaravairi yaparaadri kavvala@M
janina naMdha mayina jagamu bhaMgi
ninnu@M gaanakunna neerajalOchana!
yaMdhatamasa matula magudu mayya.

అంధకారవైరి = సూర్యుడు {అంధకార వైరి - చీకటికి శత్రువు, సూర్యుడు}; అపర = పడమటి; అద్రి = కొండ; కిన్ = కు; అవ్వలన్ = ఆవతల పక్కకి; చనినన్ = వెళ్ళగా; అంధము = చీకటిగా; అయిన = అయి నట్టి; జగము = లోకము; భంగిన్ = వలె; నిన్నున్ = నిన్ను; కానక = చూడగా లేకుండగ; ఉన్న = ఉన్న యెడల; నీరజలోచన = కృష్ణ {నీరజ లోచన - (నీటిలో పుట్టినది) పద్మము వంటి కన్నుల ఉన్న వాడు}; అంధతమస = చీకటి వంటి అజ్ఞానముతో కూడిన; మతులము = బుద్ది కల వారము; అగుదుము = అవుతాము; అయ్య = తండ్రీ.

అంబనవాంబు

అంబ, నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!

ఓ యమ్మా! వికాస ప్రకాశాలకి ప్రతీకగా నవనవలాడుతూ విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్త్రుతంగా విహారిస్తుండే బంగారుతల్లీ! భారతీదేవి! నన్ను నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!
ఎఱ్ఱన గారి అరణ్యపర్వంలోని ఈ మహత్తర మైన పద్యాన్ని, భాగవత గ్రంధారంభ ప్రార్థనగా గౌరవించారు పోతనామాత్యుల వారు.

1-9-u.
aMba, navaaMbujOjvalakaraaMbuja, SaaradachaMdrachaMdrikaa
DaMbara chaarumoorti, prakaTa sphuTa bhooshaNa ratnadeepikaa
chuMbita digvibhaaga, SRtisookti vivikta nijaprabhaava, bhaa
vaaMbaraveedhi viSrutavihaariNi, nan gRpa@M jooDu bhaaratee!

అంబ = తల్లీ; నవ = లేత; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదాన; శారద = శరదృతువు లోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = డాబు గల; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = కొట్టొచ్చినట్లు కనబడెడి; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శృతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్త్రుతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = అనుగ్రహించుము; భారతీ = సరస్వతీదేవీ.

అంభోజనాభున

అంభోజనాభున కంభోజనేత్రున; కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు;దేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ; బొందువానికి నాదిపురుషునకును
నఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ; డైనవానికిఁ, బరమాత్మునకును,
. ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! యమితచరితు!

తన పుత్రుడు నరకాసురుని వధ అనంతరం భూదేవి సత్యాపతిని స్తోత్రం చేస్తోంది సర్వభూత స్వరూపుడా! సాటిలేని వాడ! పరమేశ్వరా! అపర పరాలు తానే యైన మహితాత్ముడా! మేరలులేని వర్తనలు కలవాడ! నీవు పద్మనాభుడవు; పద్మాక్షుడవు; పద్మ మాలా విభూషణుడవు; పద్మపాదుడవు; అనంతశక్తి స్వరూపుడవు(1); వసుదేవు సుతుడవు(2); దేవాధిదేవుడవు; భక్తులు కోరిన రూపం ధరించ గల వాడవు(3); ఆది పురుషుడవు; సమస్త జగత్తుకు కారకుడవు; పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు; పరమాత్మవు; సృష్టికర్తల పుట్టుకకు కారణ మైన వాడవు; పుట్టుక లేనివాడవు; అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను.

10.2-202-see.
aMbhOjanaabhuna kaMbhOjanaetruna; kaMbhOjamaalaasamanvitunaku
naMbhOjapaduna kanaMtaSaktiki vaasu; daevunakunu daevadaevunakunu
bhaktulu gOrinabhaMgi nae roopaina@M; boMduvaaniki naadipurushunakunu
nakhila nidaanamai yaapoorNavij~naanu@M; Denavaaniki@M, baramaatmunakunu,
aa. dhaata@M ganna maeTitaMDriki, najuniki,
neeku vaMdanaMbu nae nonartu
nikhilabhootaroopa! nirupama! yeeSa! pa

అంభోజనాభున్ = పద్మ నాభున {అంభోజ నాభుడు - జగత్సృష్టికి కారణ మైన బ్రహ్మ జనించిన కమలము నాభి యందు కలవాడు, విష్ణుమూర్తి}; కిన్ = కి; అంభోజ నేత్రున్ = పద్మాక్షున; కిన్ = కు; అంభోజ = పద్మముల; మాలా = దండ; సమన్వితున్ = కలిగి ఉన్న వాని; కున్ = కి; అంభోజ = పద్మములవంటి; పదున్ = పాదములు కల వాని; కున్ = కి; అనంత = అంతులేని {అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు}; శక్తి = శక్తి కల వాని; కిన్ = కి; వాసుదేవున్ = కృష్ణుని {వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు}; కును = కి; దేవ దేవున్ = దేవుళ్ళకే దేవుని; కును = కి; భక్తులు = భక్తులు; కోరిన = అపేక్షించిన; భంగిన్ = విధముగా; ఏ = ఎట్టి; రూపు = స్వరూపము {ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు}; ఐనన్ = అయినను; పొందు = ధరించెడి; వాని = వాని; కిన్ = కి; ఆది పురుషున్ = మూలకారణభూతు డైన వాని; కును = కి; అఖిల = సమస్తమునకు; నిదానము = ఆధారభూతమై; ఆపూర్ణ = సంపూర్ణ మైన; విఙ్ఞానుడు = విఙ్ఞానము తానైన వాడు; ఐన = అయిన; వాని = వాని; కిన్ = కి; పరమాత్మున్ = పరబ్రహ్మ ఐన వాని; కును = కి; ధాతన్ = బ్రహ్మను; కన్న = పుట్టించిన; మేటి = గొప్ప; తండ్రి = తండ్రి; కిన్ = కి; అజున్ = పుట్టుక లేని వాని; కిన్ = కి; నీ = నీ; కున్ = కు; వందనంబు = నమస్కారము; నేన్ = నేను; ఒనర్తున్ = చేసెదను; నిఖిల = సమస్త; భూత = జీవ; రూప = స్వరూపుడ; నిరుపమ = పోలికల కతీత మైనవాడ; ఈశ = సర్వ నియామక; పరా = పరా ప్రకృతియు; అపరా = అపరా ప్రకృతియు; ఆత్మ = స్వరూప మైన వాడ; మహిత = మిక్కిల గొప్ప వాడ; అమిత = మేర లేని; చరిత = వర్తన కల వాడ.

అక్క

9-582-ఆ.
అక్క తల్లి చెల్ల లాత్మజ యెక్కిన
పాను పెక్కఁ జనదు పద్మనయన!
పరమయోగికైన బలిమిని నింద్రియ
గ్రామ మధికపీడఁ గలుగఁ జేయు.

ఒకరోజు జ్ఞానోదయ మయి విరక్తి మార్గం చెందిన యయాతి తన భార్య దేవయానితో బస్తోపాఖ్యానం వ్యాజేతిహాసం చెప్పి వానప్రస్థాశ్రమం చేపడతా నంటూ యిలా చెప్పసాగాడు ఓ పద్మా ల్లాంటి కన్ను లున్న దేవయాని! మహా యోగీశ్వరుల కయినా సరే ఇంద్రియాలు బలవంత మై కీడు చేస్తాయి. అందుచేత కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లి యెక్కిన మంచం ఎక్క కూడదు.

9-582-aa.
akka talli chella laatmaja yekkina
paanu pekka@M janadu padmanayana!
paramayOgikaina balimini niMdriya

అక్క = పెద్ద సోదరి; తల్లి = అమ్మ; చెల్లెలు = చిన్న సోదరి; ఆత్మజ = కూతురు; ఎక్కిన = ఎక్కి నట్టి; పానుపున్ = మంచము పైకి; ఎక్క జనదు = ఎక్క రాదు; పద్మనయన = పద్మాక్షీ; పరమ = మహా; యోగి = ఋషి; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికి; బలిమినిన్ = బలవంతముగా; ఇంద్రియ = ఇంద్రియముల; గ్రామము = సమూహము; అధిక = మిక్కిలి; పీడన్ = చీకాకులు; కలుగజేయున్ = కలుగచేస్తాయి.

అక్కట

1-164-ఉ.
అక్కట! పుత్త్ర శోక జనితాకుల భార విషణ్ణచిత్త నై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చు ఎలాట సహింపని దై భవదీయ మాత, నేఁ
డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?

పోయిన బిడ్డల పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఏడుస్తు ఇక్కడ ఉన్నాను. అట్లాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చా డన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామ! అలాగే అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఇంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుంది కదా.
రాత్రి చీకటిలో నిద్రిస్తున్న ద్రౌపది పుత్రు లైన ఉపపాండవుల తలలు నరికేసిన అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి కృష్ణార్జునులు ఆమె ఎదుట పడేసారు. అప్పటి ఆమె పలుకులలోని పద్యం ఇది. ఈ సందర్భం తనకు బాధ కలిగేది ఇతరులకు చేయకుండా ఉండటం ధర్మం అన్నది మరువని ధర్మవర్తనుల ధర్మపత్ని వర్తన, పాండవుల ధర్మ ఔన్నత్యం ఎంతటిదో సూచిస్తోంది.

1-164-u.
akkaTa! puttra SOka janitaakulabhaara vishaNNachittanai
pokkuchu nunna bhaMgi ninu@M bOra@M gireeTi nibaddhu@M jaesi nae@M
DikkaDa keeDchi techchuTa sahiMpanidai bhavadeeya maata, nae@M
DekkaDa niTTi SOkamuna naekriya naeDchuchu@M bokkuchunnadO?

అక్కట = అయ్యో; పుత్త్రశోక = పుత్రులు పోయిన దుఃఖం వలన; జనిత = పుట్టిన; ఆకుల = బాధ యొక్క; భార = భారముతో; విషణ్ణ = దుఃఖ పడిన; చిత్తన్ = మనసు కల దానను; ఐ = అయ్యి; పొక్కుచున్ = కుమిలిపోతూ; ఉన్న = ఉన్నట్టి; భంగిన్ = విధముగా; నినున్ = నిన్ను; పోరన్ = యుద్ధములో; కిరీటి = అర్జునుడు; నిబద్ధున్ = బంధింపబడిన వానిగా; చేసి = చేసి; నేఁడు = ఇవాళ; ఇక్కడ = ఇక్కడ; కున్ = కు; ఈడ్చి = లాక్కొంటూ; తెచ్చుటన్ = తీసుకొచ్చుటను; సహింపనిది = ఓర్చుకో లేనిది; ఐ = అయ్యి; భవదీయ = మీ యొక్క; మాత = తల్లి; నేఁడు = ఇవాళ; ఎక్కడన్ = ఎక్కడ; ఇట్టి = ఇలాంటి; శోకమున = దుఃఖముతో; ఏ = ఏ; క్రియన్ = విధముగా; ఏడ్చుచున్ = ఏడుస్తూ; పొక్కుచు = కుమిలిపోతూ; ఉన్నదో = ఉన్నదో.

అటమట

1-374-చ.
అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁబోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?

1-374-cha.
aTamaTamayye naa bhajana maMtayu bhoovara! nae@MDu sooDumaa
yiTuvale gaaraviMchu jagadeeSu@MDu gRshNu@MDu laeni pimmaTaM
baTutara daehalObhamuna@M braaNamu lunnavi veMTa@MbOka nae@M
gaTakaTa! poorvajanmamuna@M garmamu leTTivi chaesinaa@MDanO?

అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణ నిర్యాణం చెప్తున్నాడు అయ్యయ్యో నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడ ఇంకా నాప్రాణాలు ఆయన వెంట పోకుండ ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి పాపకృత్యాలు చేసానో కదా.

  అటమటము = గజిబిజి / వృథా; అయ్యెన్ = అయ్యెను; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = మొత్తము అంతా; భూవర = భూమికి భర్తా / రాజా; నేఁడు = ఇవాళ; సూడుమా = చూడవోయి; ఇటువలె = ఇలా; గారవించు = ఆదరించు / గారాబము చేయు; జగధీశుఁడు = జగత్తునకు ఈశుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేని = లేకపోయిన; పిమ్మటన్ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన {పటు - పటుతరము - పటుతమము}; దేహ = శరీరము మీది; లోభమునన్ = పిసినారితనముతో / మమకారముతో; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి = ఉన్నవి; వెంటన్ = కూడా; పోకన్ = వెళ్ళకుండగనే; నేన్ = నేను కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; జన్మమునన్ = జన్మలలో; కర్మములు = పాపం పనులు; ఎట్టివి = ఎలాంటివి; చేసినాఁడనో = చేసానో.

అడిగెదనని

8-103-క.
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

8-103-ka.

aDigeda nani kaDuvaDi@M janu
naDigina@M danu maguDa nuDuga@M Dani naDa yuDugun
veDaveDa siDimuDi taDa@MbaDa
naDu giDu; naDugiDadu jaDima naDu giDuneDalan.

కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి ఎందుకు వెళ్తున్నాడో అడగాలి అని వేగంగా అడుగులు ముందుకు వేసేది. అడిగితే సమాధానం చెప్పడేమో అని నడక మానేసేది. చీకాకుతో కూడిన తొట్రుబాటు వలన మళ్ళీ ముందుకు అడుగు వేసేది. మళ్ళీ ఆగేది. అలా నడిచే టప్పుడు తడబడుతూ అడగులు వేసేది.

  అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగి నప్పటికిని; తను = అతను; మగుడ = మారు పలుకులు; నుడువుడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.

అతులదివ్య

5.1-128-తే.
అతుల దివ్యాన్న మైన మృష్టాన్న మైన
నెద్ధి వెట్టిన జిహ్వకు హితముగానె
తలఁచి భక్షించుఁ గా; కొండుఁ దలఁచి మిగులఁ

లేడి పిల్ల మీద వ్యామోహంతో మరణించిన భరతుడు, మరు జన్మలో బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణుల ఇంట పుట్టాడు. అతడు ఎంతో రుచికర మైన చక్కటి అన్నం పెట్టిన, పాసిపోయిన అన్నం పెట్టిన కాదనకుండ ఒకే విధంగా స్వీకరించేవాడు. అంతే కాని ఇంకోలా చూసి రుచుల కోసం అర్రులు చాచే వాడు కాదు.

5.1-128-tae.
atula divyaanna maina mRshTaanna maina
neddhi veTTina jihvaku hitamugaane
tala@Mchi bhakshiMchu@M gaa; koMDu@M dala@Mchi migula@M
breeti chaeya@MDu ruchulaMdu@M beMputODa.

అతుల సాటిలేని; దివ్య దివ్య మైన;అన్నమున్ ఆహారము;ఐనన్ అయినను;మృష్ట రుచికర మైన;అన్నమున్ ఆహారము;ఐనన్ అయినను;ఎద్ది ఏది; పెట్టినన్ పెట్టి నప్పటికిని;జిహ్వ నాలుక;కున్ కు; హితమున్ ఇష్టము;కానె అగు నట్లు; తలచి భావించి; భక్షించున్ తినును;కాక కాని;ఒండు మరి యొక విధముగ;తలచి భావించి; మిగులన్ మిక్కలి;ప్రీతి చేయడు ఇష్టపడడు; రుచులు రుచులు;అందున్ ఎడల;పెంపు అతిశయము;తోడన్ తోటి.

అనయంబు

4-43-సీ.
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన;హీనుఁడు మర్యాదలేని వాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం;బరుఁడు భూత ప్రేత పరివృతుండు
దామస ప్రమథ భూతములకు నాథుండు; భూతిలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట;హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని
తే. కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చి నటులు.

దక్షుడు శివుని ఎలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు). మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు). నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాదికి తరతమ భేదాలకి అతీతుడు). మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు). పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు). నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు). భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి). తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు). ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు). అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు). (ఉన్మత్తులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు). ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు). శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు). జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు). శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు). అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం) ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.

4-43-see.
anayaMbu luptakriyaakalaapu@MDu maana;heenu@MDu maryaadalaeni vaa@MDu
mattaprachaaru@M Dunmattapriyu@MDu digaM;baru@MDu bhoota praeta parivRtuMDu
daamasa pramatha bhootamulaku naathuMDu; bhootiliptuM DasthibhooshaNuMDu
nashTaSauchuMDu nunmadanaathu@MDunu dushTa;hRdayu@M Dugru@MDunu baraetabhoo ni
tae. kaetanu@MDu vitatasrastakaeSu@M DaSuchi
yayina yitaniki Sivanaamu@M Danu pravaada
meTulu galige? naSivu@M Dagu nitani neRi@Mgi

  అనయంబున్ = ఎప్పుడు, మిక్కిలి; లుప్త = శూన్యమై పోయిన; క్రియా = పనులు, యఙ్ఞకర్మములు; కలాపుడు = చేయుటలు కలవాడు; మాన = శీలము, అభిమానము; హీనుడు = లేనివాడు; మర్యాద = మర్యాద, నియమములు; లేనివాడు = లేనట్టివాడు; మత్త ప్రచారుడు = మత్తెక్కి తిరుగు వాడు, మిక్కిలి ప్రచారము కలవాడు; ఉన్మత్త ప్రియుడు = పిచ్చివారి కిష్ఠుడు, ఉన్మత్తులు అనెడి భూతగణములకు నాయకుడు; దిగంబరుడు = దిక్కులే అంబరముగా కలవాడు; భూతప్రేత = భూత ప్రేతములు చేత; పరివృతుండు = చుట్టబడి యుండు వాడు; తామస = తమో గుణము కల; ప్రమథ = ప్రమథ; భూతముల్ = గణముల; కున్ = కి; నాథుండు = నాయకుడు; భూతి = బూడిద, విభూతి; లిప్తుండు = పూసుకొనువాడు; అస్థి = ఎముకలు; భూషణుండు = అలంకారములుగ కలవాడు; నష్ట శౌచుండు = శుచిత్వము లేని వాడు; దుష్ట హృదయుడు = దుష్ట మైన మనసు కలవాడు; ఉగ్రుడు = ఉగ్ర రూపము కల వాడు; పరేత భూమిని కేతనుడు = శ్మశాన వాసి; వితత స్రస్త = మిక్కిలి విరబోసుకొన్న; కేశుడు = కేశములు కల వాడు; అశుచి = అపవిత్రడు; అయిన = అయి నట్టి; ఇతని = ఇతని; కిన్ = కి; శివ = శివ యనెడి; నాముడు = పేరు బడ్డ వాడు; అను = అనెడి; ప్రవాదము = తప్పుడు ప్రచారము; ఎటులన్ = ఎలా; కలిగెన్ = కలిగినది; అశివుడు = అశుభ మైన వాడు; అగు = అయి నట్టి; ఇతనినన్ = ఇతనిని; ఎఱిగియెఱిగి = బాగ తెలిసుండు కూడ; వేదంబున్ = వేదములను; శూద్రున్ = శూద్రుని; కిన్ = కి; ఇచ్చినటుల = ఇచ్చినట్లు.

అనుపమగుణహారా

1-529-మా.
అనుపమగుణహారా! హన్యమా నారివీరా!
జన వినుతవిహారా! జానకీ చిత్త చోరా!
దనుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
ఘన కలుష కఠోరా! కంది గర్వాపహారా!

1-529-maa.
anupamaguNahaaraa! hanyamaa naariveeraa!
jana vinutavihaaraa! jaanakee chitta chOraa!
danuja ghana sameeraa! daanavaSree vidaaraa!
ghana kalusha kaThOraa! kaMdi garvaapahaaraa!


  అనుపమ = సాటి లేని; గుణ = గుణములు అను; హారా = హారము కల వాడా; హన్యమాన = చంపబడిన; అరివీరా = శత్రువీరులు కల వాడా; జన = జనుల చేత; వినుత = స్తుతింప దగ్గ; విహారా = విహారములు కల వాడా; జానకీ = జానకి యొక్క; చిత్త = మనస్సును; చోరా = దొంగిలించిన వాడా; దనుజ = రాక్షసులు అను; ఘన = మేఘములకు; సమీరా = వాయువు వంటి వాడా; దానవ = దానవుల; శ్రీ = ని; విదారా = విదళించు వాడా, బ్రద్దలు కొట్టు వాడా; ఘన = అత్యధిక, కరడు గట్టిన; కలుష = పాపుల ఎడ; కఠోరా = కఠోరముగా ఉండు వాడా; కంది = సముద్రుని; గర్వ = గర్వమును; అపహారా = తొలగించిన వాడా.

అన్నవు

10.1-26-ఉ.
అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో?
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
మిన్నుల మ్రోతలే నిజము, మేలని చంపకు మన్న మాని రా
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.

10.1-26-u.
annavu niivu chelleliki; nakkata ! mAdalu chiira lichchutO?
Mannana cheEyutO? maDHura maMjula Bhaashala naadhariMchutO?
Minnula mrOthalE nijamu, mE lani chaMpaku manna mAni rA

కంసుడు ఆకాశవాణి పలుకులు విని చెల్లి దేవకిని చంపబోతుంటే. వసుదేవుడు అతనిని శాంత పరచే సందర్భంలో దీ పద్యం.
బావ! ఈ అబల చెల్లెలు నువ్వు అన్నవు కదా! ధనం, బట్టలు లాంటి బహుమతు లివ్వాలి. ఆడబడచు అంటు గౌరవించాలి. మృదు వైన మాటలతో ఆదరించాలి కదయ్య. అంతేగాని, అయ్యో! ఇదేమి టయ్య? గాలి మాటలే నిజ మని నమ్మి ఈ అమాయకురాలిని వధించ బోతున్నావు. ఆమెని వదలి పెట్టు. ఓర్పు వహించు. ఈ పని నీకు తగదయ్య. వేడుకుం టున్నాను ఈమెను చంపకయ్య.

అన్నవు = జ్యేష్టభ్రాతవు; నీవున్ = నీవు; చెల్లెలి = ఆడబడుచున; కిన్ = కి; అక్కట = అయ్యో; మాడలు = బంగారు బిళ్ళలు; చీరలు = కోకలు; ఇచ్చుటో = ఇవ్వడముకాని; మన్నన = గౌరవించుట; చేయుటో = చేయటముకాని; మధుర = తియ్యని; మంజుల = చక్కటి; భాషలన్ = మాటలతో; ఆదరించుటో = ఆదరించుటకాని అంతేకాని; మిన్నుల = ఆకాశ; మ్రోతలే = పలుకులే; నిజము = సత్యములు; మేలు = సరియైనవి; అని = అనుకొని; చంపకు = సంహరింపకము; అన్న = అయ్య; మాని = ప్రయత్నము విరమించి; రావు = వెనుకకు రమ్ము; అన్న = అయ్య; సహింపుము = ఓర్పు వహించుము; అన్న = తండ్రి; తగదు = తగినపనికాదు; అన్న = నాయనా; వధింపకుము = చంపకుము; అన్న = అయ్య; వేడెదన్ = ప్రార్థించుచుంటిని.

అభ్రంలిహా

4-107-సీ.
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్ర భ్రమ; కృన్నీల దీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్త జ్వాలికా జాల; జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ; సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణ త్రయ లోక వీక్షణ ద్యుతి లోక;వీక్షణ తతి దుర్నిరీక్ష్యముగను
తే. గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపా లాస్థి వనమాలికలును దనర
నఖిల లోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.

దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్ని యందు దగ్ధమయింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరి కొట్టాడు. ఆ మహారుద్రుని జట నుంచి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసార్థమై ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం వృత్తౌచిత్యం భావౌచిత్యం శబ్దాడంబరం అర్థగాంభీర్యాలతో అలవోకగా అలరించే మన సహజకవి ఈ పోతనామాత్యల సీసపద్యం వీరభద్రుని బహుదీర్ఘదేహాన్ని సూచిస్తున్న మణిరత్మం. సకల లోకాలకూ భయం కలిగించే రెండవ రుద్రుని వలె వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతు కాలమేఘ మేమో అనే భ్రాంతి కలిగిస్తున్నది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వంటి వెయ్యి బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన మూడు కన్నులు చండప్రచండ మార్తాండుల వంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరి చూడరాకుండా ఉన్నాడు. మెడనిండా కపాలమాలలు వ్రేల్లాడుతుండగా. వంకర్లు తిరిగి రంపాల్లా కరకు దేలిన కోరలుతో మిక్కలి భయంకరంగా ఉన్నాడు.

4-107-see.
abhraMlihaadabhra vibhra maabhra bhrama; kRnneela deergha Sareera mamara@M
brajvalajjvalana deepta jvaalikaa jaala; jaajvalyamaana kaeSamulu me~raya@M
veekshaNa traya lOka veekshaNa dyuti lOka; veekshaNa tati durnireekshyamuganu
tae. grakacha kaThina karaaLa daMshTralu veluMga
ghana kapaa laasthi vanamaalikalunu danara
nakhila lOka bhayaMkaru@M Daguchu veera
bhadru@M DudayiMche maa~raTa rudru@M Daguchu.

అభ్రంలిహ = ఆకాశమును నాకుచున్న; అదభ్ర = మహావిస్తార మై; విభ్రమ = పరిభ్రమిస్తున్న; అభ్ర = మేఘముల వంటి; భ్రమకృత్ = సుడులు తిరుగుచున్న; నీల = నల్లని; దీర్ఘ = పొడవైన; శరీరము = దేహము; అమరన్ = అమరి యుండగ; ప్రజ్వల = బాగా మండుతున్న; జ్వలన = మంటల; దీప్త = వెలుగుతున్న; జ్వాలికా = మంటల; జాల = సమూహముల వలె; జాజ్వల్యమాన = మండిపోతున్నట్టున్న; కేశములు = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగ; చండ = భయంకరమైన; దిగ్వేదండ = దిగ్గజముల యొక్క; శుండా = తొండములు; అభ = వంటి; దోర్దండ = చేతులు; సాహస్ర = వేనవేలు; ధృత = ధరింపబడిన; హేతి = ఆయుధముల; సంఘము = సమూహము; ఒప్ప = ఒప్పుతుండగ; వీక్షణ = కన్నుల; త్రయ = మూడింటి; లోక = లోకములను; వీక్షణ = చూసెడి చూపుల; ద్యుతిన్ = కాంతి; లోక = లోకము లందలి; వీక్షణ = చూసే వారి; తతి = సమూహమునకు; దుర్నిరీక్ష్యముగను = చూడశక్యము కాకుండగ; క్రకచ = ఱంపము వలె; కఠిన = కరుకైన; కరాళ = వంకర్లు తిరిగిన; దంష్ట్రలు = కోరలు; వెలుంగ = ప్రకాశిస్తుండగ; ఘన = పెద్ద; కపాల = పుర్రెలు; అస్థి = ఎముకలు కూర్చిన; వనమాలికలు = ఆకులు పూల దండలు; తనరన్ = అతిశయించగ; అఖిల = సమస్త మైన; లోక = లోకములకు; భయంకరుడు = భీకరుడు; అగుచున్ = అవుతూ; వీరభద్రుడు = వీరభద్రుడు; ఉదయించెన్ = పుట్టెను; మాఱట = రెండవ; రుద్రుడు = భయంకరుడు వలె; అగుచున్ = అవుతూ.

అమ్మలగన్న

1-10-ఉ.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా తెలుగు భాగవత ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

1-10-u.
ammala@M gannayamma, mugurammalamoolapuTamma, chaala@M be
ddamma, suraarulamma kaDu paa~raDi vuchchina yamma, tannu lO
nammina vaelpuTammala manammula nuMDeDi yamma, durga, maa
yamma, kRpaabdhi yichchuta mahattvakavitva paTutva saMpadal.

అమ్మలు = అమ్మలు(సప్త మాతృకలు); అన్ = ను; కన్న = కన్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = తల్లి; ముగురు = ముగ్గురు {ముగురు అమ్మలు - లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = అమ్మలకి; మూలపు = మూల మైన; అమ్మ = అమ్మ; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సురారుల = రాక్షసుల యొక్క {సురారులు సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు}; అమ్మ = తల్లుల; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = మనసు లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు.

అమ్మా

1-507-క.
అమ్మా! నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో
రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!

మనోహర అలలతో అలరారే గంగమ్మతల్లి!నిన్ను దర్శించినంత మాత్రంచేతనే మోక్షానికి పంపిస్తావని విన్నాను, కదిలి రావమ్మా! కనికరించమ్మా!
పుణ్యంతో స్వర్గప్రాప్తిస్తుంది. అర్హుడైన జ్ఞాని వైరాగ్యం పొంది తగిన సమయ మెరిగి చేసిన ప్రాయోపవేశంతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఏ ఒక్కటి లేకపోయినా అది ఆత్మహత్యే, మహాపాపమే. పరమ జ్ఞాని పరీక్షిన్మహారాజుకి అర్హత ఉంది. శృంగిశాప మెరుగుటచే వైరాగ్యం సిద్దించింది. తక్షకవిషంతో మరణం తప్పదని తెలిసిన ఆ సమయం తగింది. పరమ పావనమైన గంగానది తగిన స్థలం. అప్పుడు అక్కడ పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశానికి సిద్ద మయ్యి గంగమ్మ తల్లిని స్తుతించేడు. పరమయోగి శుకుడు వచ్చి మహామంత్రరాజం మహాభాగవతం చెప్పాడు. పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడు.

1-507-ka.
lemmaa nee roopamutO
rammaa naa kedura gaMga! ramyataraMgaa!

అమ్మా = తల్లీ; నినున్ = నిన్ను; చూచిన = దర్శించిన మాత్రముననే; నరున్ = మానవుని; పొమ్మా = వెళ్ళు; అని = అని; ముక్తి = మోక్షము; కడ = వద్ధ; కున్ = కి; పుత్తువు = పంపుదువు; అఁటన్ = అట; కృపన్ = దయతో; లే = లేచిరా; అమ్మా = తల్లీ; నీ = నీయొక్క; రూపము = రూపము; తోన్ = తో; రా = రా; అమ్మా = తల్లీ; నాకు = నాకు; ఎదుర = ఎదురుగా; గంగ = గంగామాత; రమ్య = మనోహరమైన; తరంగా = కెరటాలు కలదానా.

అలవాటు

9-275-క.
అలవాటు కలిమి మారుతి
లలితామిత లాఘవమున లంఘించెను శై
వలినీగణసంబంధిన్
జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్.

హనుమంతుడు అలవాటు ఉండటం వలన నదులకు బంధువు (చేరుగడ), భూమికి ఆకాశానికి వ్యవధానం అయ్యి నీటితో నిండి ఉండే సముద్రాన్ని చక్కటి మిక్కిలి నేర్పుతో దాటాడు.
హనుమ దాటిన సముద్రం ఎంత పెద్దది అంటే నదులలోని నీళ్ళన్ని అలా వచ్చి కలుస్తోనే ఉంటాయి కదా; ఆ నీళ్ళు అన్నిటితో నిండి ఉంటుంది, భూమి ఆకాశం కలిసినట్టు కనిపించేటంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది, అంత పెద్దది; అంత పెద్ద సముద్రాన్ని రామ కార్యం కోసం అవలీలగా ఎలా దాటాడంటే; ఆంజనేయుడు చిన్నతనంలోనే సూర్యుణ్ణి పండు అనుకొని అందుకోడానికి ఎగిరాడు కదా; ఆలా దూకే అలవాటు ఉండటం వలన సీతాదేవిని వెదకటానికి వెళ్తూ సముద్రాన్ని అలవోకగా దాటాడు.

9-275-ka.
alavaaTu kalimi maaruti
lalitaamita laaghavamuna laMghiMchenu Sai
valineegaNasaMbaMdhin
jalapoorita dharaNi gagana saMdhiM gaMdhin.

అలవాటు = అభ్యాసము {అలవాటుకలిమి - హనుమంతుడు బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయినది సూచింప పడుతున్నది}; కలిమిన్ = ఉండుట చేత; మారుతి = హనుమంతుడు {మారుతి - వాయుపుత్రుడు, హనుమంతుడు}; లలిత = సున్నిత మైన; అమిత = అత్యధిక మైన; లాఘవమునన్ = నేర్పుతో; లంఘించెను = దాటెను; శైవలినీ = నదుల {శైవలిని నాచు గలది, నది}; గణ = సమూహమునకు; సంబంధిన్ = బంధు వైన దానిని; జల = నీటితో; పూరిత = నిండి యుండి; ధరణి = భూమిని; గగన = ఆకాశమును; సంధిన్ = కలుపు దానిని; కంధిన్ = సముద్రమును {కంధి - కం (నీటికి) నిధి, కడలి}.

అలవైకుంఠపురంబులో

8-95-మ.
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యనఁ గుయ్యాలించి సంరంభి యై.

కష్టాలలో చిక్కుకున్న వారిని రక్షించే విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ వారి అంతఃపురం ఉంది. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఒళ్ళు తెలియని భయంతో కాపాడు కాపాడు అని మొరపెట్టుకోటం ఆలకించాడు.

8-95-ma.
pala maMdaara vanaaMta raamRta sara@h praaMtaeMdu kaaMtOpalO
tpala paryaMka ramaavinOdi yagu naapanna prasannuMDu vi
hvala naagaeMdramu paahi paahi yana@M guyyaaliMchi saMraMbhi yai.

అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరి = రాజ భవన సముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత శిల; ఉప = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించు చున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో నున్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అను; కుయ్యాలించి = మొర ఆలించి; సంరంభి = వేగిరపడు తున్న వాడు; ఐ = అయ్యి.

ఆఁకలి గొన్న

6-400-ఉ.
ఆఁకలి గొన్న క్రేపులు రయంబున నీకలు రాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశ గతుం డగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో
శ్రీకర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నా మది గోరెడుం గదే.

6-400-u.
aa@Mkali gonna kraepulu rayaMbuna neekalu raani pakshulun
vyaakulachitta yaina javaraalunu datta~ra maMdu bhaMgi nO!
Sreekara! paMkajaaksha! ninu@M jaera@Mga naa madi gOreDuM gadae.

  వృత్రాసుర వృత్తాంతం భాగవత అంతరార్థానికి ఒక చక్కటి ఉదాహరణ, విశేష్ఠ మైన భక్తి పరాకాష్టను వివరించే చక్కటి కథ. వృత్రాసురుడు అరివీర భయంకర ప్రతాపం తో యుద్దం చేస్తున్నాడు. భగవంతుని అనుగ్రహం సంపాదించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో సంహారం చేయ బోతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుని చేసిన ప్రార్థన ఒకటి.
ఓ సకల శుభాల సంధానకర్తా! శ్రీహరీ! పుండరీకాక్ష! ఆకలితో అలమటించే లేగదూడలు గోమాత కోసం ఎదురు చూస్తుందో, నిరీక్షిస్తున్న రెక్కలు రాని పక్షిపిల్లలు తల్లి కోసం ఆత్రుతతో ఎలా ఎదురు చూస్తాయో ఇంకా విదేశ గతుడు అయినట్టి పతి కోసం విరహవ్యాకులత చెందిన సతి ఎలా ప్రతీక్షిస్తుందో అలా నీ కోసం, నీ సమాగమం కోసం నా మది ఉవ్విళ్ళూరు తున్నదయ్యా.

ఆకలి = ఆకలి; కొన్న = వేస్తు న్నట్టి; క్రేపులు = దూడలు; రయంబునన్ = శ్రీఘ్రముగను; ఈకలు = రెక్కలు; రాని = రానట్టి; పక్షులున్ = పక్షిపిల్లలు; దీకొని = పూని; తల్లి = తల్లి; కిన్ = కి; మఱి = మఱి; విదేశ = పరాయి దేశములకు; గతుండు = వెళ్ళిన వాడు; అగు = అయిన; భర్తన్ = భర్త; కున్ = కోసము; అంగజ = మన్మథుని వలన; వ్యాకుల = వ్యాకులమైన; చిత్త = మనసు గలది; ఐన = అయిన; జవరాలునున్ = స్త్రీ; తత్తఱము = తొందర; అందు = పడెడి; భంగిన్ = వలెనే; ఓ = ఓ; శ్రీకర = హరి {శ్రీకర - శ్రీ (శుభములను) కర (కలిగించెడివాడ), విష్ణువు}; పంకజాక్ష = హరి {పంకజాక్షుడు - పంకజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నినున్ = నిన్ను; చేరగన్ = చేరవలె నని; నా = నా యొక్క; మదిన్ = మనసులో; కోరెడుం గదే = కోరెదను గాక.

ఆతత సేవ

1-3-ఉ.
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.

సృష్టిలోని చరాచర భూతాలన్నిటిని సృష్టించే పర జ్ఞానికి, సరస్వతి మనోరంజకునికి, వేదాలను వెలువరించివానికి, సర్వ దేవ తాధిపునికి, పాప సంహారునికి, విధాతకు, ఋషులకు శుభప్రదాతకు కోరి మొక్కుతాను.
1-3-u
aatata sEvaM~ jEseda samasta charaachara bhoota sRiShTi vi
Gyaataku bhaaratee hRidaya saukhya vidhaataku vEdaraashi ni
rNEtaku dEvataa nikara nEtakuM~ galmaSha jEtakun nata
traataku dhaatakun nikhila taapasa lOka shubha pradaatakun.

ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేసెదను; సమస్త = సమస్తమైన; చర = చరములు; అచర = అచరములుయైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించే; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీ = భారతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్ = కి; వేద = వేదాల; రాశి = సమూహాలను; నిర్ణేత = ఏర్పరిచిన వాడు; కున్ = కి; - దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాత = బ్రహ్మ; కున్ = కి; నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి.

ఆతేరా

1-376-శా.
ఆ తేరా రథికుండు నా హయము లా యస్త్రాసనం బా శర
వ్రాతం బన్యులఁ దొల్లి జంపును దుదిన్ వ్యర్థంబు లైపోయె మ
చ్చోతోధీశుండు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి ము
యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్.

1-376-Saa.
vraataM banyula@M dolli jaMpunu dudin vyarthaMbu laipOye ma
chchOtOdheeSuMDu chakri laemi bhasitakshiptaajya maayaavi maa
yaataMtrOsharabhoomibeejamula maryaadan nimaeshaMbunan.

అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణానంతంరం వెనుకకు హస్తిన చేరి అన్నగారు ధర్మరాజువద్ద వాపోతున్నాడు. ఆత్మేశ్వరుడు చక్రధారి యైన శ్రీకృష్ణుడు లేకపోడంతో ఆ రథం, ఆ రథంపై నున్న నేను, ఆ గుర్రాలు, ఆ విల్లంబులు శత్రుసంహారకా లైన అవన్ని నిరుపయోగ మైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయలా, చవిటిపర్ర ఐన పొలంలో చల్లిన విత్తనాల్లా అన్ని క్షణకాలంలో నిరర్థకాలు అయిపోయాయి.

  ఆ = అదే; తేరు = రథము; ఆ = అదే; రథికుండున్ = రథమునెక్కిన వీరుడు; ఆ = అదే; హయములు = గుర్రములు; ఆ = అదే; అస్త్రాసనంబు = విల్లు; ఆ = అదే; శర = అస్త్రముల; వ్రాతంబు = సమూహము; అన్యులన్ = పరులను; తొల్లి = ఇంతకుముందు; చంపును = సంహరిస్తుండేవి; తుదిన్ = చిట్టచివరకి / ఆఖరికి; వ్యర్థంబులు = నిరుపయోగములు; ఐపోయెన్ = అయిపోయినవి; మత్ = నా యొక్క; చేతస్ = మనసునకు / ప్రజ్ఞకు; అధీశుండు = అధిపతి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధుడు - కృష్ణుడు}; లేమి = లేకపోవుటచేత; భసిత = బూడిదలో; క్షిప్త = చిమ్మబడిన; ఆజ్య = నేయియును; మాయావి = ఐంద్రజాలికుని; మాయాతంత్ర = గారడీయును; ఊషరభూమి = చవిటిపర్రలో చల్లిన; బీజముల = విత్తనములును; మర్యాదన్ = వలె; నిమేషంబునన్ = నిమిషములో.

ఆదర మొప్ప

1-5-ఉ.
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోదకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్.

తన తల్లి పర్వత పుత్రి యైన పార్వతీదేవి మనస్సులో అనురాగ మనే సంపద సంపాదించినవాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు. ఆశ్రితులకు సంతోషం కలిగించేవాడు, సమస్తమైన విఘ్నా లనే తాళ్ళను భేదించేవాడు, మనోఙ్ఞంగా మాట్లాడేవాడు, భక్తులకు సర్వలోకస్తులకు ఆనంద ప్రదాత, మోదం కలిగించే ఉండ్రాళ్ళను తృప్తిగా ఆరగించేవాడు, చక్కటి మూషిక వాహను డైనవాడు, మోదప్రదాయకుడు అయిన వినాయకునికి వంగి వందనాలు చేస్తాను.
1-5-u.
aadara moppa mrokkiDudu nadri sutaa hRidayaanuraaga saM
paadiki dOShabhEdikiM~ brapannavinOdiki vighnavallikaa
chchhEdiki maMjuvaadiki nashESha jagajjana naMda vEdikin
mOdakakhaadikin samada mooShaka saadiki suprasaadikin.
ఆదరము = మన్నన; ఒప్పన్ = ఉట్టిపడేలా; మ్రొక్కున్ = నమస్కారమును; ఇడుదున్ = పెట్టెదను; అద్రి = పర్వత; సుతా = పుత్రి; హృదయ = హృదయ; అనురాగ = అనురాగాన్ని; సంపాది = సంపాదించినవాడు; కిన్ = కి; దోష = పాపాలని; భేది = పోగొట్టేవాడు; కిన్ = కి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోది = సంతోషము కలిగించు వాడు; కిన్ = కి; విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; చ్ఛేది = నాశనముచేసే వాడు; కిన్ = కి; మంజు = మనోజ్ఞముగ; వాది = మాట్లాడే వాడు; కిన్ = కి; అశేష = అనేక; జగత్ = లోకములందలి; జన = జనులకు; నంద = ఆనందము; వేది = కలిగించే వాడు; కిన్ = కి; మోదక = ఉండ్రాళ్ళు; ఖాది = తిను వాడు; కిన్ = కి; సమద = చక్కగ; మూషక = ఎలుక; సాది = నడిపే వాడు; కిన్ = కి; సుప్రసాది = మంచి నిచ్చే వాడు; కిన్ = కి.