A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Monday, March 7, 2011

ఆది శంకరాచార్య భజగోవిందం

 వికీపీడియా నుండి తీసుకోవడం జరిగింది:

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు (Adi Shankaracharya). ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

 

ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుని రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండీ శంకరుడు ఉదాహరించాడు. స్వానుభవానికి శంకరుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అతని రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుని రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంధాలు, స్తోత్రాలు.

భాష్యాలు

వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంధాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరుడు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తులనుండి విస్తృతంగా ఉదాహరించాడు. శంకరుడు క్రింది గ్రంధాల గురించి భాష్యాలు వ్రాశాడు.
ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరుడు వ్రాశాడా అన్న విషయం గురించి సందేహాలున్నాయి. బ్రహ్మ సూత్రాలకు శంకరుడు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. కాని శంకరుడు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నాడు.

ప్రకరణ గ్రంధాలు

ప్రకరణ గ్రంధాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.
  • వివేక చూడామణి
  • ఉపదేశ సహస్రి
  • శతశ్లోకి
  • దశశ్లోకి
  • ఏక శ్లోకి
  • పంచ శ్లోకి
  • ఆత్మబోధ
  • అపరోక్షానుభూతి
  • సాధనా పంచకము
  • నిర్వాణ శతకము
  • మనీషా పంచకము
  • యతి పంచకము
  • వాక్య సుధ
  • తత్వబోధ
  • సిద్ధాంత తత్వవిందు
  • వాక్యవృత్తి
  • సిద్ధాంత తత్వవిందు
  • నిర్గుణ మానస పూజ

శంకరుడు వ్రాసాడని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరుడు వ్రాసాడని అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి (వేరేవారు వ్రాసినా శంకరుని పేరు మీద ప్రసిద్ధమయ్యాయని)

స్తోత్రాలు

భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరుడు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన "గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" అనే స్తోత్రం ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. శంకరులు వ్రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:
వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.

 

శ్లోకం - 1 

భజగోవిన్దం భజగోవిన్దం
గోవిన్దం భజమూఢమతే|
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే||

శ్లోకం అర్ధం : గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.
 
Worship Govinda, worship Govinda, worship Govinda, Oh fool ! Rules of grammar will not save you at the time of your death.

 

శ్లోకం - 2

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||

శ్లోకం అర్ధం : ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

Oh fool ! Give up your thirst to amass wealth, devote your mind to thoughts to the Real . Be content with what comes through actions already performed in the past.

 

శ్లోకం - 3

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||

శ్లోకం అర్ధం : స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము. 

Do not get drowned in delusion by going wild with passions and lust by seeing a woman's navel and chest . These are nothing but a modification of flesh . Fail not to remember this again and again in your mind.

 

శ్లోకం - 4

నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||

శ్లోకం అర్ధం : తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము

The life of a person is as uncertain as rain drops trembling on a lotus leaf . Know that the whole world remains a prey to disease, ego and grief.

 

శ్లోకం - 5

యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే||

శ్లోకం అర్ధం : ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు.

So long as a man is fit and able to support his family, see what affection all those around him show . But no one at home cares to even have a word with him when his body totters due to old age.

 

శ్లోకం - 6

యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే|
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే||

శ్లోకం అర్ధం : శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.

When one is alive, his family members inquire kindly about his welfare . But when the soul departs from the body, even his wife runs away in fear of the corpse. 

 శ్లోకం - 7


బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||

శ్లోకం అర్ధం : బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

The childhood is lost by attachment to playfulness . Youth is lost by attachment to woman . Old age passes away by thinking over many things . But there is hardly anyone who wants to be lost in parabrahman.

 

శ్లోకం - 8

కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః|
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః||

 శ్లోకం అర్ధం : ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.
 
Who is your wife ? Who is your son ? Strange is this samsaara, the world. Of whom are you ? From where have you come ? Brother, ponder over these truths.

 

శ్లోకం - 9

సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం|
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||

శ్లోకం అర్ధం : జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.
 
From satsanga, company of good people, comes non-attachment, from non-attachment comes freedom from delusion, which leads to self-settledness . From self-settledness comes Jiivan muktii.

 

శ్లోకం - 10

వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః|
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః||

శ్లోకం అర్ధం : వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత 
సంసార బంధము ఏముండును?
 
What good is lust when youth has fled ? What use is a lake which has no water ? Where are the relatives when wealth is gone ? Where is samsaara, the world, when the Truth is known ?

 

శ్లోకం - 11

మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం|
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||

శ్లోకం అర్ధం : ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

Do not boast of wealth, friends, and youth . Each one of these are destroyed within a minute by time . Free yourself from the illusion of the world of Maya and attain the timeless Truth.

 

శ్లోకం - 12

దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః||

శ్లోకం అర్ధం : రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

Daylight and darkness, dusk and dawn, winter and springtime come and go . Time plays and life ebbs away . But the storm of desire never leaves.
 
ద్వాదశమఞ్జరికాభిరశేషః
కథితో వైయాకరణస్యైషః .
ఉపదేశో భూద్విద్యానిపుణైః
శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః ..
This bouquet of twelve verses was imparted to a grammarian by the all-knowing Shankara, adored as the bhagavadpada.


శ్లోకం - 13

కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా|
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా||

శ్లోకం అర్ధం : ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.
 
Oh mad man ! Why this engrossment in thoughts of wealth ? Is there no one to guide you ? There is only one thing in three worlds that can save you from the ocean of samsaara, get into the boat of satsanga, company of good people, quickly.

 

శ్లోకం - 14

జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః|
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః||

శ్లోకం అర్ధం : జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.
 
There are many who go with matted locks, many who have clean shaven heads, many whose hairs have been plucked out; some are clothed in orange, yet others in various colors --- all just for a livelihood . Seeing truth revealed before them, still the foolish ones see it not.

 

శ్లోకం - 15

అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం|
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం||

శ్లోకం అర్ధం : శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు.
 
Strength has left the old man's body; his head has become bald, his gums toothless and leaning on crutches . Even then the attachment is strong and he clings firmly to fruitless desires.

 

శ్లోకం - 16

అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః|
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః||

శ్లోకం అర్ధం : తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు.
 
Behold there lies the man who sits warming up his body with the fire in front and the sun at the back; at night he curls up the body to keep out of the cold; he eats his beggar's food from the bowl of his hand and sleeps beneath the tree . Still in his heart, he is a wretched puppet at the hands of passions.

 

శ్లోకం - 17

 కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం|
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన||

శ్లోకం అర్ధం : గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.
 
One may go to Gangasagar, observe fasts, and give away riches in charity ! Yet, devoid of jnana, nothing can give mukthi even at the end of a hundred births.

 

శ్లోకం - 18

 సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః|
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః||


శ్లోకం అర్ధం : దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు?
 
Take your residence in a temple or below a tree, wear the deerskin for the dress, and sleep with mother earth as your bed . Give up all attachments and renounce all comforts . Blessed with such vairagya, could any fail to be content ?

 

శ్లోకం - 19

యోగరతో వా భోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవిహీనః|
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ||

శ్లోకం అర్ధం : యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.
 
One may take delight in yoga or bhoga, may have attachment or detachment . But only he whose mind steadily delights in Brahman enjoys bliss, no one else .

 

శ్లోకం - 20

భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||

శ్లోకం అర్ధం : భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.
 
Let a man read but a little from giitaa, drink just a drop of water from the ganges, worship but once muraari . He then will have no altercation with Yama

 

శ్లోకం - 21

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||

శ్లోకం అర్ధం : మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.
 
Born again, death again, again to stay in the mother's womb ! It is indeed hard to cross this boundless ocean of samsaara . Oh Murari ! Redeem me through Thy mercy. 

శ్లోకం - 22

రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః|
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ||

శ్లోకం అర్ధం : వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.
 
There is no shortage of clothing for a monk so long as there are rags cast off the road . Freed from vices and virtues, onward he wanders . One who lives in communion with god enjoys bliss, pure and uncontaminated, like a child and as an intoxicated.

 

శ్లోకం - 23

కస్త్వం కోఅహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః|
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం||

శ్లోకం అర్ధం : సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.
 
Who are you ? Who am I ? From where do I come ? Who is my mother, who is my father ? Ponder thus, look at everything as essenceless and give up the world as an idle dream.

 

శ్లోకం - 24

త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః|
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వమ్||

శ్లోకం అర్ధం : నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.

In me, in you and in everything, none but the same Vishnu dwells . Your anger and impatience is meaningless . If you wish to attain the status of Vishnu, have samabhaava, equanimity, always.

 

శ్లోకం - 25

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ|
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్||


శ్లోకం అర్ధం : శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు?
 
Waste not your efforts to win the love of or to fight against friend and foe, children and relatives . See yourself in everyone and give up all feelings of duality completely.

 

శ్లోకం - 26

కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం|
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః||

శ్లోకం అర్ధం : కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు.
 
Give up lust, anger, infatuation, and greed . Ponder over your real nature . Fools are they who are blind to the Self . Cast into hell, they suffer there endlessly.

 

శ్లోకం - 27

గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం|
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం||

శ్లోకం అర్ధం : భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను.
Regularly recite from the Gita, meditate on Vishnu in your heart, and chant His thousand glories . Take delight to be with the noble and the holy . Distribute your wealth in charity to the poor and the needy.

 

శ్లోకం - 28

సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్దంత శరీరే రోగః|
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం||

శ్లోకం అర్ధం : ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు.
 
He who yields to lust for pleasure leaves his body a prey to disease . Though death brings an end to everything, man does not give-up the sinful path.

 

శ్లోకం - 29

అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం|
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః||

శ్లోకం అర్ధం : ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది.
 
Wealth is not welfare, truly there is no joy in it . Reflect thus at all times . A rich man fears even his own son . This is the way of wealth everywhere.

 

శ్లోకం - 30

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం|
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం||

శ్లోకం అర్ధం : సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.

Regulate the praaNa-s, life forces, remain unaffected by external influences and discriminate between the real and the fleeting . Chant the holy name of God and silence the turbulent mind . Perform these with care, with extreme care.

 

శ్లోకం - 31

గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః|
సేంద్రియమానస నియమాదేవ
ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం||


శ్లోకం అర్ధం : అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.
 
Oh devotee of the lotus feet of the Guru ! May thou be soon free from Samsara . Through disciplined senses and controlled mind, thou shalt come to experience the indwelling Lord of your heart !

మూఢః కశ్చన వైయాకరణో
డుకృఞ్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః ..
Thus a silly grammarian lost in rules cleansed of his narrow vision and shown the Light by Shankara's apostles.
భజగోవిన్దం భజగోవిన్దం
గోవిన్దం భజమూఢమతే .
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ..
Worship Govinda, worship Govinda, worship Govinda, Oh fool ! Other than chanting the Lord's names, there is no other way to cross the life's ocean.

శ్లోకం అర్ధం ములు (తెలుగు) http://sankaracharyabhajagovindam.blogspot.com/ ఈ బ్లాగ్ నుండి తీసుకోవడం జరిగింది.

ఆది శంకరాచార్యలు గురించి వినడానికి  క్లిక్ చేయండి : ఆది శంకరాచార్య చరిత్ర 


2 comments: