A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Tuesday, February 11, 2014

సిరికిం జెప్పఁడు

శ్రీనాధుడు పోతనగారి భాగవతం లోని " సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డు " అని చదివిన తరువాత పోతనతో ఏమిటి బావ ఈ పద్యం .. సిరికిం చెప్పాడంట .. శంకు చక్రం ధరించుట లేదంటా .. ఎవర్ని తోడూ తీస్కుని వెళ్ళడం లేదంటా . ఏమిటి బావ ఇది ఆయనేమన్నా వేడుక చూడ్డానికి వెళ్తున్నాడ ? అని పోతన తో అంటూ ఉండగా . ఈ లోపు పోతనగారి భార్య అన్నయ్య రండి భోజనం చేద్దురుగాని అనడటంతో ఇద్దరు భోజనానికి కూర్చుని భోజనం చేస్తున్నారంట . ఈ లోపు బావిలో ఏదో పడిన నీటి శబ్దం వచ్చింది . ఆ వెంటనే మామయ్యా సరస్వతి ( సరస్వతి శ్రీనాధుడు కుమార్తె ) భావిలో పడిపోయింది .. రండి రండి అంటూ కేకలు వినిపిస్తూ ఉండేటప్పడికి .. భోజనం చేస్తున్న శ్రీ నాధుడు వెంటనే లేచి భావి చుట్టూ సరస్వతి సరస్వతి అంటూ పిలుచుస్తూ ఉండగా . పోతనగారి అబ్బాయ్ మామయ్య సరస్వతి కి ఏమి కాలేదు . నేనే బావిలో రాయి వేసాను . ఐన మామయ్య బావిలో ఉన్న మీ అమ్మాయ్ ని రక్షించడానికి వస్తున్నారు అని తెలిసి కూడా ఎవర్ని పిలవలేదు .. కనీసం ఒక తాడు కూడా తీస్కుని రాలేదు . ఆ చేతిని కూడా కడగకుండానే వచ్చసారేం అని అడిగేసరికి . " సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ;" పద్యం ఎందుకు అలా రచించారో అర్ధం అయి నిజమే మానవులకు మనకే ఇంత ప్రేమ ఉంటే .. భగవంతుడికి ఇంకేంత ప్రేమ ఉండాలి అని నాకు బాగా అర్ధం అయ్యేలా చెప్పావ్ రా అని నవ్వి లోపలకి వెళ్లారాంట . 



సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ' డభ్రగపతిం బన్నింపఁ' డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

భావము :
సిరికింజెప్పఁడు - సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుటలేదు; శంఖచక్రయుగముంజేదోయి - శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులురెంటియందు; సంధింపఁడే - సంధింపడు = ధరించుటలేదు; ఏ = ఏ; పరివారంబునుఁజీరఁడభ్రగపతింబన్నింపఁడాకర్ణికాంతరధమ్మిల్లముఁజక్కనొత్తఁడు - పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరులైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుపనియమించడు; ఆకర్ణిక = చెవిదుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమిల్లమున్ = జుట్టుముడిని; చక్కనొత్తడు = చక్కదిద్ధుకొనుటలేదు; వివాదప్రోత్థితశ్రీకుచోపరి - వివాద = ప్రణయకలహమునందు; ప్రోత్థిత = పైకిలేచుచున్న; శ్రీ = లక్ష్మీదేవియొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలమైన - చేలాంచలము = చీరకొంగు; ఐనన్ = అయినను; వీడఁడు - వీడడు = వదలిపెట్టుటలేదు; గజప్రాణావనోత్సాహి - గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; ఆవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహముకలవాడు; యై - ఐ = అయ్యి.
http://telugubhagavatam.org/products.php?psid=462&catid=6&scatid=24&ccatid

2 comments: