A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Tuesday, February 11, 2014

అల వైకుంఠపురంబులో

భాగవత రచనలో ముఖ్యంగా ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది . గజేంద్రుడు పిలిచినప్పుడు వైకుంటం లో ఉన్న విష్ణుమూర్తి ని వర్ణించాలి .. అసలు వైకుంటం లో విష్ణుమూర్తి ఎలా ఉండి ఉంటాడు . అక్కడ ఏమి ఉంటాయ్ . ఎలా వర్ణించాలి అని పోతన గారు ఎంతగా ఆలోచిస్తున్న తనకి ఏమి తట్టడం లేదంటా .. పోతన గారు వాళ్ళ అమ్మాయ్ తో నేను గుడివరకు వెళ్ళిస్తాను అని చెప్పారంట.. ఆయన వచ్చేలోపే సాక్షాత్తు వైకుంటా వాసే వచ్చి పద్యాన్ని పూర్తీ చేసి వెళ్ళాడు . అదే ఈ పద్యం చూడండి 

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.



8-95-మ.| అల = అక్కడ; వైకుంఠపురంబులో - వైకుంఠ = వైకుంఠమనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరిలోనా - నగరి = రాజభవనసముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందారవనాంతరామృతసరః - మందార = మందారపూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృతజలపు; సరస్ = సరోవరము; ప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు - ప్రాంత = సమీపమునగల; ఇందుకాంత = చంద్రకాంత; ఉప = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపైనున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించుచున్నవాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలోనున్నవారిని; ప్రసన్నుండు = అనుగ్రహించువాడు; విహ్వలనాగేంద్రము - విహ్వల = విహ్వలముచెందినట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహిపాహి = కాపాడుకాపాడు; యనఁగుయ్యాలించి - అనన్ = అనుచు; కుయ్యాలించి = మొరపెట్టుకొని; సంరంభియై - సంరంభి = వేగిరపడుతున్నవాడు; ఐ = అయ్యి.
http://telugubhagavatam.org/products.php?psid=462&catid=6&scatid=24&ccatid=

No comments:

Post a Comment