A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Wednesday, February 12, 2014

భీముడు

భీముడు మాటలను పోతనగారు రచించిన విధం .. భీమ స్వరూపాన్ని ఆయన కోపాన్ని మనకల్లకు కట్టినట్టు చూపించారు . పోతన తెలుగు లో రచించడమే కాదు కోపం లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తామో అలాంటి పదాలతోనే పద్యాలనూ రచించారు . మనం మమోలుగా వెఱ్రివాడు , వెఱ్ఱిది అని ఉపయోగిస్తాం . వీటినే తీస్కుని భీముడు చేత పలికించిన ఈ పద్యం మీరే చూడండి .

కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు బాలఘాతుకున్
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది; వీఁడు విప్రుఁడే?
విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్.



తన కన్నకొడుకులను చంపేసాడు అని తెలిసినా కూడ ఈ శిశుహంతకుడు అశ్వత్థామ మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోటం లేదు. పైగా వదలి వదలిపెట్టమంటోంది. ఎంత పిచ్చిదో చూడండి. బ్రాహ్మణుడు కదా వదలేయమంటోంది. ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా చెప్పండి. వీడిని వదలవలసిన అవసరం ఏంలేదు, చంపెయ్యండి. మీరు కనుక చంపకపోతే నేనే ఓగుద్దు గుద్ది వీడి బుర్రబద్దలుకొట్టేస్తాను. మీరంతా చూస్తూ ఉండండి.
దుర్యోధనునికి సంతోషంకలిగించటానికి అశ్వత్థామ ఉపపాండవులను అతిక్రూరంగా అర్థరాత్రి కటిక చీకటిలో సంహరించాడు. శ్రీకృష్ణార్జునులు వెంట తరిమి పట్టుకొని తీసుకొచ్చారు. సాధ్వీమణి అంతటి బాధలోను చక్కటి సంయమనంతో ఆలోచించి అశ్వత్థామను వదలిపెట్టమంది. కాని భీముడు ఉద్రేకంలోంచి ఇంకా బయటపడలేక తన కోపం ఇలా చూపుతున్నాడు.

http://telugubhagavatam.org/products.php?pg=2&cntstart=0&psid=66&catid=6&scatid=10
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment: